కీర్తి ఒప్పుకుంటుందా..?

హీరోయిన్లను డీల్ చేసే విషయంలో బెల్లంకొండ సురేష్ కు సెపరేట్ స్టయిల్ ఉంది. తన కొడుకుని హీరోగా పెట్టి చేసిన ప్రతి సారి స్టార్ హీరోయిన్లనే రంగంలోకి దింపాడు. మొదటి సినిమాకే సమంతను ఒప్పించి అందులో తమన్నా ఐటెమ్ సాంగ్ కూడా పెట్టాడు. ఇప్పుడు బోయపాటి సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసుకున్నాడు. ఈ హీరోయిన్స్ కు వారు తీసుకునే రెమ్యూనరేషన్ కంటే యాభై శాతం ఎక్కువే ఇస్తాడు. ఇప్పుడు బెల్లంకొండ సురేష్ కన్ను కీర్తి సురేష్ పై పడింది.

మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న కీర్తికి దక్షిణాదిన మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ కారణంతోనే తన కొడుకు నటించబోయే తదుపరి సినిమాలో హీరోయిన్ గా కీర్తిని సంప్రదిస్తున్నారు. దీనికోసం ఆమెకు ఏకంగా కోటి డెబ్బై లక్షలు ఆఫర్ చేస్తున్నట్లు టాక్. ప్రస్తుతం అయితే తెలుగులో కీర్తికి ఆ రేంజ్ మార్కెట్ లేదనే చెప్పాలి. కానీ బెల్లంకొండ మాత్రం రెమ్యూనరేషన్ విషయంలో ఆమెను బాగా ఊరిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఆఫర్ కు కీర్తి ఒప్పుకుంటుందో.. లేదో.. చూడాలి!