HomeTelugu Newsమహేష్‌తో ప్రియా వారియర్?

మహేష్‌తో ప్రియా వారియర్?

9 1

ఒక కన్నుగీటి సెన్సేషన్ స్టార్‌ ఎదిగింది ప్రియా వారియర్. ‘ఒరు ఆడార్ లవ్‌’ పేరుతో రూపొందిన చిత్రం ద్వారా మలయాళ ప్రేక్షకులకు పరిచయమైంది ప్రియా ప్రకాష్ వారియర్. ఈ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో విడుదల చేశారు. వింక్ వీడియోతో పాపులర్ అయిన చిన్నది ఆ స్థాయిలో మాత్రం అవకాశాల్ని దక్కించుకోలేకపోయింది. తాజాగా ప్రియా వారియర్ కు సంబందించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రియా ప్రకాష్ వారియర్ ను మహేష్ బాబు 27వ చిత్రం కోసం పరశురామ్ సంప్రాదించాడట. లాక్‌డౌన్ తరువాత ఆడిషన్ నిర్వహించాకే ఫైనల్‌గా నిర్ణయం తీసుకోనున్నారని అంటున్నారు. ఇక తెలుగులో ఈ భామ నితిన్‌కు జంటగా నటించనుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. మహేష్ బాబు రేంజ్ కు ఆమెతో రొమాన్స్ ఏంటీ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu