మహేష్ సినిమాకు భారీ ఆఫర్!

మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. కొన్ని రోజులుగా ఇక్కడ సినిమాకు సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అదే స్థాయిలో భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. దానికి తగ్గట్లుగానే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుగుతోంది. ఈ సినిమా ఆడియో, శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకోవడానికి ఓ ప్రముఖ ఛానెల్ వారు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలుగు.. తమిళ శాటిలైట్ రైట్స్ కోసం 21 కోట్లను.. హిందీ డబ్బింగ్ రైట్స్ నిమిత్తం 5 కోట్లను చెల్లించడానికి వారు సిద్ధంగా ఉన్నారని సమాచారం. గతంలో మహేష్ ‘శ్రీమంతుడు’ సినిమా శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్న జీటీవీ వారే ఈ ఆఫర్ ను ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికార ప్రకటన రానుంది. ఈ సినిమాకి ‘అభిమన్యుడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చినప్పటికీ, తాజాగా ‘ఏజెంట్ శివ’ అనే టైటిల్ ఎక్కువగా వినిపిస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates