మహేష్ కథతో బాలయ్య..?

మహేష్ బాబుతో ‘పోకిరి’,’బిజినెస్ మెన్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన పూరీజగన్నాథ్ ఆయన కోసం ‘జనగణమన’ అనే మరో దేశభక్తి చిత్రాన్ని రూపొందించి ఆయనకు వినిపించారు. మహేష్ బాబు పుట్టినరోజు నాడు దీనికి సంబంధించి ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అయితే ఇదే విషయమై ఇటీవల పూరీని సంప్రదించగా మహేష్ కు కథ అయితే నచ్చింది కానీ ఇప్పటివరకు సినిమా గురించి స్పందించలేదని వెల్లడించారు. ప్రస్తుతం మహేష్, మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దాని తరువాత కొరటాల శివతో మరో సినిమా చేయబోతున్నాడు. ఇక పూరీకి సమయం ఎక్కడది. అందుకే పూరీ ఈ కథను బాలకృష్ణకు వినిపించడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మొన్నమధ్య బాలయ్య, వర్మను కలిసినప్పుడు పూరీ దగ్గర ఓ కథ ఉంది.. మీరొక సారి వినండని బాలకృష్ణకు చెప్పాడట. దాంతో బాలయ్య పూరికి కబురు పంపగా.. అదే కథను బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా మార్చి వినిపించబోతున్నాడని అంటున్నారు. మరి బాలయ్య అయినా.. ఈ సినిమాలో నటిస్తాడో.. లేక మహేష్ లానే సమయం దాటేస్తాడో.. చూడాలి!