కరోనాపై చిరంజీవి, టాలీవుడ్‌ హీరోల స్పెషల్ సాంగ్.. వైరల్‌


కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున, యంగ్‌ హీరో వరుణ్‌తేజ్, సాయితేజ్‌లు గొంతు కలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి స్వరపరిచి పాడిన పాటకు వీరంతా అభినయించారు. కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు నటులందరూ ముందుకొచ్చారు.

తమవంతు సాయం ప్రకటిస్తూ తమలోని దాతృత్వ గుణాన్ని చాటుతున్నారు. చిరంజీవి సారథ్యంలో ఇటీవల కరోనా క్రైసిస్ చారిటీ పేరిట ఓ సంస్థ ఏర్పడింది. పలువురు నటీనటులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరిస్తూ కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, చిరంజీవి, నాగార్జున, వరణ్‌తేజ్, సాయితేజ్, కోటి అభినయించిన ఈ పాటకు విపరీతమైన స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.