త్రిషకు బంపర్‌ ఆఫర్‌..!

సూపర్‌ స్టార్‌.. మహేష్ బాబు హీరోగా చేసిన అతడు సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మహేష్ తో పాటు సమానంగా నటించి మెప్పించింది. తనను తాను గొప్పగా ఊహించుకుంటూ.. చేసిన పాత్రలో మెప్పించింది. తెలుగులో అనేక సినిమాల్లో నటించిన ఈ చెన్నై బ్యూటీ మాతృభాష తమిళంలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోయి నటించింది.

అయితే, చాలా కాలంగా ఆమెకు మంచి సినిమా లేదు. 96 సినిమాతో త్రిష తిరిగి లైన్లోకి వచ్చింది. సినిమా హిట్ కావడంతో రజినీకాంత్ తో పేట సినిమా చేసే దొరికింది. ఈ మూవీలో ఆమె పాత్ర కొద్దిసేపే అయినప్పటికీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ అమ్మడికి భారీ అఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. తమిళంలో మణిరత్నం తీస్తున్న పొన్నియన్ సెల్వం సినిమాలో ఓ పాత్ర కోసం త్రిషను సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే.. త్రిష బంపర్ అఫర్ కొట్టేసినట్టే.