HomeTelugu NewsMAJNU 2nd song release

MAJNU 2nd song release

‘ఓయ్‌.. మేఘమాల..’ 
నాని హీరోగా ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ చిత్రం ‘మజ్ను’
రెడ్‌ ఎఫ్‌.ఎం. ద్వారా రెండవ పాట విడుదల 
 
చిత్రం ‘భలే భలే మగాడివోయ్‌’ తర్వాత నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా పి.కిరణ్‌ నిర్మాణ సారధ్యంలో ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై ‘ఉయ్యాలా జంపాలా’ ఫేం విరించివర్మ దర్శకత్వంలో గోళ్ళ సూపర్‌హిట్‌ గీత నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మజ్ను’. ఈ చిత్రానికి సంబంధించి ‘కళ్ళు మూసి తెరిచే లోపే.. గుండెలోకే చేరావే..’ అంటూ సాగే మొదటి పాటను ఇటీవల రేడియో మిర్చి ద్వారా విడుదల చేశారు. కాగా, ‘ఓయ్‌.. మేఘమాల..’ అంటూ సాగే రెండో పాటను ఈరోజు రెడ్‌ ఎఫ్‌.ఎం. ద్వారా రిలీజ్‌ చేశారు. 
ఈ చిత్రం ఆడియోను లహరి మ్యూజిక్‌ ద్వారా ఈ వారంలోనే రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్‌లో చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఓ ప్రత్యేక పాత్రలో కనిపించడం విశేషంగా చెప్పుకోవచ్చు. 
నేచురల్‌ స్టార్‌ నాని, ఇమ్మానుయేల్‌, ప్రియాశ్రీ, వెన్నెల కిషోర్‌, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య, శివన్నారాయణ, రాజ్‌ మాదిరాజ్‌, కేవశదీప్‌, అనుపమ, మనీషా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌., సంగీతం: గోపీసుందర్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, నిర్మాణ సారధ్యం: పి.కిరణ్‌, నిర్మాత: గోళ్ళ గీత, దర్శకత్వం: విరించి వర్మ. 
 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!