HomeTelugu Trending'పుష్ప' మేకింగ్‌ వీడియో

‘పుష్ప’ మేకింగ్‌ వీడియో

Making Of Pushpa
ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’. సుకుమార్‌ డైరెక్షణలో వచ్చిన క్రేజీ హ్యాట‍్రిక్‌ చిత్రం ఇది. స్టార్‌ హీరోయిన్‌ సమంత ఈసినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో అలరించింది. డిసెంబర్‌ 17న విడుదలైన ‘పుష్ప’ సినిమా విశేష ప్రేక్షాదరణ పొందుతోంది. కాగా, ఈ సినిమా మేకింగ్‌ వీడియోను సోషల్‌ మీడియా వేదికగా ఆదివారం (డిసెంబర్ 17) విడుదల చేసింది చిత్రబృందం. ఈ వీడియోలో పాటలు, యాక్షన్‌ సన్నివేశాలు ఎలా చిత్రీకరించారో చూపించారు. అడవిలో సెట్లు ఎలా వేశారు ? నటులు, దర్శకుడి మధ్య సంభాషణలు ఎలా ఉన్నాయి ? అనేవి వీడియోలో కనిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా సంస్థలు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా రెండో భాగం ‘పుష్ప: ది రూల్‌’ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu