HomeTelugu Trendingడెవిల్‌: రోజీ ఫస్ట్‌లుక్‌

డెవిల్‌: రోజీ ఫస్ట్‌లుక్‌

elnaaz norouzi first look f 1

నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ నుంచి వస్తున్న తాజా చిత్రం డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉప‌శీర్షిక‌. ఈ చిత్రానికి అభిషేక్ నామా ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన క‌ల్యాణ్‌రామ్, మాళవిక నాయర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లు.. సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మూవీ నుంచి కొన్నాళ్లుగా ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొత్త న్యూస్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌ కోసం నయా అప్‌డేట్‌ బయటకు వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ ఎల్నాజ్ నొరౌజీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ మూవీలో ఎల్నాజ్ నొరౌజీ రోజీ అనే బార్ డాన్స‌ర్ పాత్రలో నటిస్తోంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు నవీన్‌ మేడారం దర్శకత్వం వహించాడు. అయితే అనూహ్యంగా రీసెంట్‌గా రిలీజైన పోస్టర్‌లలో ఆయన పేరు కనిపిచండం లేదు. ఈ సినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ అభిషేక్‌ నామా పేరు దర్శకుడిగా క‌నిసిస్తుంది. ఇక‌ దీనిపై ట్విట్టర్‌లో పెద్ద చర్చలే జరుగుతున్నాయి.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu