ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘రంగమార్తాండ’. కాలెపు మధు – వెంకట్ నిర్మించిన ఈ సినిమాకి, ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలను నటించిన ఈ సినిమా ‘ఉగాది’ కానుకగా ఈ నెల 22వ తేదీన విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. రంగస్థల నటుడిగా తన గత వైభవాన్ని ప్రకాశ్ రాజ్ గుర్తుచేసుకునే నేపథ్యంలో ఈ ట్రైలర్ ను వదిలారు. తన కుటుంబ సభ్యులే తన పెద్దరికానికి ఎదురు తిరగడం .. తన కూతురే తనని దొంగగా అనుమానించడం వంటి సంఘటనలు తట్టుకోలేక భార్యతో మరో ప్రయాణాన్ని మొదలుపెట్టడం .. ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది. బలమైన ఎమోషన్స్ తో కూడిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

జీవితంలో నటనను ప్రాణంగా భావించిన ఒక రంగస్థల కళాకారుడి అనుభవాలు .. జ్ఞాపకాలుగా ఈ సినిమా రూపొందింది. అనుభూతులకు .. భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ కథ నడుస్తుంది. ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్ వలన అంచనాలు పెరుగుతూ పోతున్నాయి. చాలా గ్యాప్ తరువాత కృష్ణవంశీ చేస్తున్న ఈ సినిమా మంచి అంచనాలు ఉన్నాయి.

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates