HomeTelugu Newsఆమ్ ఆద్మీ పార్టీ తరుపున ప్రకాశ్ రాజ్ ప్రచారం

ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున ప్రకాశ్ రాజ్ ప్రచారం

13 3ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నట్లు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తెలిపారు. అయితే తాను ఆప్ లో చేరడంలేదని, ఆ పార్టీ సిద్ధాంతాలు తనకు బాగా నచ్చడంతోనే ప్రచారం చేయనున్నట్లు స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో ఆ పార్టీనేతలతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘అరవింద్‌ కేజ్రీవాల్‌ అధ్యక్షుడుగా ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ సిద్ధాంతాలు బాగున్నాయి. ఆరోగ్యం, విద్య విషయంతో పార్టీ ఆలోచనలు బాగున్నాయి. అందుకే పార్టీ తరపున ప్రచారం చేయాలనుకుంటున్నాను. ప్రస్తుత ప్రభుత్వం ప్రజాస్వామ్య దేశానికి తూట్లు పొడుస్తోంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు అంతా ఏకతాటికి పైకి రావాల్సిన అవసరం ఉంది. సిద్దాంతాల పరంగా కొన్ని పార్టీలు దూరంగా ఉన్నా.. దేశం కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం అంతా ఏకం కావాలి. ఆప్‌ ఆ దిశగా వెళ్తోంది కాబట్టే నేను మద్దతు ఇస్తున్నాను. తనకు మోడీకి మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. కేవలం కొన్ని విషయాల్లో వారు అనుసరిస్తున్న విధానాలకే తాను వ్యతిరేకమన్నారు. మోడీ పేరు చెప్పుకొని కొంత మంది బీజేపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అలాంటి వారిని ప్రశ్నిస్తే తిరిగి సమాధానంగా ప్రశ్నే వస్తోంది’ అని ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన న్యూ ఢిలీ​, తూర్పు ఢిల్లీ నియోజకవర్గాలతో ఆప్‌ అభ్యర్థులు నిర్వహించే సభలో పాల్గొననున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!