HomeTelugu Big Storiesత్రిషకు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు: తమిళ నటుడు

త్రిషకు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు: తమిళ నటుడు

Mansoor raised another cont
తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఇటీవల నటి త్రిష పై ఇటీవలే చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది. ఆ వ్యాఖ్యలు ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలో అవకాశం రాగానే త్రిషతో రేప్ సీన్ ఏదైనా ఉంటుందేమో అని అనుకున్నాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన అతను గతంలో ఎప్పుడూ లేనివిధంగా వివాదాల్లో నిలిచాడు. అయితే ఆ విషయంపై త్రిష చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యింది.

ఇక ఆమెకు మద్దతుగా చిత్ర పరిశ్రమలోని సినీ నటులు అలాగే దర్శకులు టెక్నీషియన్స్ గాయనీ గాయకులు కూడా సోషల్ మీడియాలో మన్సూర్ అలీ ఖాన్ స్పందించిన విధానంపై తప్పుపట్టారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో నితిన్, మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆ వ్యాఖ్యలు ఏమాత్రం కరెక్ట్ కాదు అని వ్యాఖ్యానించారు.

అయితే ఈ వివాదం పై తమిళ పరిశ్రమలోని నడిగర్ సంఘం కూడా సీరియస్ అయింది. త్రిష కు క్షమాపణలు చెప్పేవరకు అతని నిషేధిస్తున్నట్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ విషయంపై మళ్ళీ స్పందించిన మన్సూర్ మరో కొత్త వివాదానికి తెర లేపాడు. ముందుగా నడిగర్ సంఘం తనపై ఎందుకు ఈ విధంగా నిర్ణయం తీసుకుందో సమాధానం చెప్పాలి అని నాలుగు గంటల లోపు ఆదేశాల్ని వెనక్కి తీసుకోవాలి ని డిమాండ్ చేశాడు.

తాను చేసిన వ్యాఖ్యలను ఏమాత్రం వెనక్కి తీసుకోవడం లేదు అంటూ మీడియా వాళ్ళు ఈ విషయంను తప్పుదోవ పట్టించారు అని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు అర్థం చేసుకోకుండా వ్యాఖ్యలను వక్రీకరించారని త్రిషకు క్షమాపణలు చెప్పే ప్రసక్తి లేదు. తనకు తమిళ ప్రజల మద్దతు పూర్తిస్థాయిలో ఉంది అని చెప్పడం విశేషం. నేను చేసిన వ్యాఖ్యలను త్రిష ఖండించింది.

అయితే ఆ స్టేట్మెంట్ ని హైలెట్ చేసిన మీడియా వాళ్ళు మా ఇద్దరి ఫోటోలను పక్కపక్కనే ప్రింట్ చేసి చూపించారు. ఆ ఫోటోలను చూస్తూ ఉంటే త్రిష పెళ్ళికూతురు నేను పెళ్లి కొడుకులా ఉన్నాను అనిపించింది. అయితే నావి మంచి ఫోటోలు తీసుకుని ఉండాల్సింది అని అతను మరొక సెటైర్ వేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇక జస్ట్ ఒక సినిమాలోని సీన్ గురించి మాట్లాడాను అని అంతమాత్రాన అది రేప్ చేసినట్టు అవుతుందా? అలాగే తెరపై మర్డర్ సన్నివేశంలో నటిస్తే అది నిజంగానే మర్డర్ చేసినట్టా? అని మన్సూర్ మీడియాను ప్రశ్నించారు. ఏది ఏమైనప్పటికీ మన్సూర్ మాత్రం తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గకుండా మరింత కాంట్రవర్సీనిగా మాట్లాడుతూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!