HomeTelugu Reviewsరివ్యూ: మన్యం పులి

రివ్యూ: మన్యం పులి

నటీనటులు: మోహన్ లాల్, కమలినీ ముఖర్జీ, నమిత, జగపతిబాబు, కిషోర్ తదితరులు..
సినిమాటోగ్రఫీ: షాజీ కుమార్
సంగీతం: గోపి సుందర్
ఎడిటింగ్: జాన్ కుట్టి
నిర్మాత: సిందూరపువ్వు కృష్ణారెడ్డి
రచన: ఉదయ్ కృష్ణ
దర్శకత్వం: వైశాక్
మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘పులిమురుగన్’ చిత్రాన్ని ‘మన్యంపులి’ పేరిట తెలుగులో
డబ్ చేశారు. మోహన్ లాల్ నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
చాలా కాలం తరువాత ఈ సినిమాతో కమలినీ ముఖర్జీ మళ్ళీ ఎంట్రీ ఇవ్వనుంది. డబ్బింగ్
సినిమా అయినా.. మొదటి నుండి ఈ చిత్రానికి తెలుగులో క్రేజ్ ఏర్పడింది. మరి ప్రేక్షకుల
అంచనాలను ఈ సినిమా ఎంతవరకు రీచ్ అయిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
పులియూరు అనే వూరు అడవికి దగ్గరగా ఉంటుంది. అక్కడ ప్రాంత ప్రజలు పులుల సంచారంతో
భయపడుతూ బ్రతుకుతూ ఉంటారు. కుమార్(మోహన్ లాల్)అనే చిన్న పిల్లాడు తన తండ్రిని
పులి చంపడం చూసి తట్టుకోలేకపోతాడు. తనే పులిని చంపాలని నిర్ణయించుకొని అంత చిన్న
వయసులోనే తన తెలివితో పులి ప్రాణాలను తీస్తాడు. అప్పటి నుండి వూరి ప్రజలు అతడిని
పులికుమార్ అని పిలుస్తూ.. అతడ్ని ఆరాధిస్తూ ఉంటారు. కుమార్ తన తమ్ముడ్ని పట్టణంలో
చదివిస్తూ ఉంటాడు. తన భార్య మైనా(కమలినీ ముఖర్జీ), తన బిడ్డలతో కలిసి పులియూరులోనే
జీవిస్తూ ఉంటాడు. అయితే పోలీసులు కుమార్ మీద పులులను చంపుతున్నాడనే ఆరోపణలతో
కేసు ఫైల్ చేస్తారు. అదే సమయంలో కుమార్ తమ్ముడి స్నేహితులు పట్టణం నుండి గంజాయి
కోసం పులియూరుకి వస్తారు. ఆ గంజాయిని క్యాన్సర్ మెడిసిన్ కోసం ఉపయోగిస్తున్నట్లు సహాయం
చేయమని కుమార్ ను కోరతారు. అది నిజమే అనుకోని కుమార్ వారికి సహాయం చేస్తారు. కుమార్
ను పోలీసులు వెంటాడుతున్నారని చెప్పి తన తమ్ముడి స్నేహితులు కుటుంబం మొత్తాన్ని,
గంజాయి లోడ్ తో ఉన్న లారీతో పాటు పట్టణం తీసుకువెళ్లిపోతారు. ఆ తరువాత ఎలాంటి
సంఘటనలు చోటుచేసుకున్నాయి..? కుమార్ ను పోలీసులు పట్టుకున్నారా..? కుమార్ లేని
పులియూరు గ్రామ ప్రజలు ఎలా బ్రతుకుతారు..? గంజాయి కోసం కుమార్ నమ్మించి మోసం
చేసిన వ్యక్తులెవరూ..? కుమార్ అసలు నిజాలు గ్రహించగలిగాడా..? అనే అంశాలతో సినిమా
నడుస్తుంటుంది.
ప్లస్ పాయింట్స్:
కథ, కథనం
మోహన్ లాల్
సంగీతం
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
ఎడిటింగ్
విశ్లేషణ:
ప్రజలను చంపుకొని తింటున్న పులులను ఎదిరించే ఓ వ్యక్తి.. అదే తన జీవితంగా బ్రతుకుతున్న
అతడికి అనుకోకుండా కొన్ని సమస్యలు ఎదురవడం వాటిని అధిగమించి అతడు ఎలా బ్రతికాడు
అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందించారు. మోహన్ లాల్ తన నటనతో అందరినీ ఆకట్టుకోవడం
ఖాయం. పీటర్ హెయిన్ డిజైన్ చేసిన ఫైట్స్ ను బాగా ఎగ్జిక్యూట్ చేశారు. యాక్షన్ సన్నివేశాల్లో
మోహన్ లాల్ ను తప్ప ఆ పాత్రలో మరెవరినీ ఊహించుకోలేమ్. అంత అధ్బుత నటనను కనబరిచారు.
తమ్ముడిని బాధ్యతగా చూసుకోవాల్సిన అన్నయ్యగా, ఓ పాపకు తండ్రిగా, తన భార్యను ప్రేమించే
భర్తగా, ప్రజలను కాపాడే ఓ యోధిడిగా ఇలా ప్రతి సన్నివేశంలో అదిరిపోయే పెర్ఫార్మన్స్ చేశారు.
కమలినీ ముఖర్జీ, మోహన్ లాల్ భార్య పాత్రలో ఆకట్టుకుంది. జగపతి బాబు ఎప్పటిలానే
ప్రతినాయకుడి పాత్రలో ఓకే అనిపించాడు. మోహన్ లాల్ చిన్ననాటి పాత్రలో నటించిన మాస్టర్
అజాస్ నటన అధ్బుతమనే చెప్పాలి. అతడు కనిపించిన పది నిమిషాలు ప్రేక్షకులను తనవైపు
తిప్పుకున్నాడు. ఉదయ్ అందించిన కథను తన ఓన్ చేసుకొని దర్శకుడు వైశాక్ తెరకెక్కించిన
తీరు అధ్బుతం. అయితే సినిమా మొదటి భాగం చూపించినంత గ్రిప్పింగ్ గా సెకండ్ హాఫ్ లేదు.
కానీ క్లైమాక్స్ సన్నివేశాలు వచ్చేప్పటికీ కథ మళ్ళీ పుంజుకుంటుంది. దర్శకుడిగా వైశాక్ కథను
ఎగ్జిక్యూట్ చేయడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక గోపిసుందర్ అందించిన మ్యూజిక్ సినిమాకు
పెద్ద అసెట్. నేపధ్య సంగీతం ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసింది. గోపిసుందర్ స్టాండర్డ్ మ్యూజిక్
ఈ సినిమాలో కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ మరో అధ్బుతం. ముఖ్యంగా హెలికామ్ షాట్స్ సినిమాకు
పెద్ద ప్లస్ అయ్యాయి. ఎడిటింగ్ వర్క్ సో.. సో.. గా అనిపించింది. మొత్తానికి అన్ని వర్గాల ఆడియన్స్
చూడగలిగే విధంగా సినిమా ఉంటుంది. తెలుగులో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను సాధించడం
ఖాయం.
రేటింగ్: 3.25/ 5

Recent Articles English

Gallery

Recent Articles Telugu