HomeTelugu News'మన్యంపులి'గా వస్తున్న మోహన్ లాల్!

‘మన్యంపులి’గా వస్తున్న మోహన్ లాల్!

‘జనతా గ్యారేజ్’ సినిమాతో తెలుగులోనూ సూపర్ హిట్ అందుకున్న మోహన్ లాల్.. ‘పులిమురుగన్’ లా మల్లూవుడ్ లో మరోసారి తన విశ్వరూపాన్ని చూపాడు. దసరా కానుకగా మళయాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్.. అక్కడ కలెక్షన్ల మోత మోగిస్తోంది. మల్లూవుడ్ చరిత్ర లోనే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘పులి మురుగన్’ చిత్రం త్వరలోనే తెలుగునాట కూడా సందడి చేయనుంది. ఈ విజువల్ వండర్ ను తెలుగులో ‘మన్యంపులి’ పేరిట శ్రీ సరస్వతి ఫిల్మ్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు. విడుదలైన తొలి వారంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా మల్లూవుడ్ లో ‘పులిమురుగన్’ రికార్డ్ క్రియేట్ చేసింది. ‘బాహుబలి’ తరువాత ఆ ఘనత ఈ చిత్రానికే దక్కడం విశేషం. ఇక ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం దక్షిణాది అగ్రనిర్మాణ సంస్థలన్నీ పోటీ పడినా.. చివరకు శ్రీ సరస్వతి ఫిల్మ్స్ కే దక్కడం విశేషం. కాగా సింధూరపువ్వు కృష్ణారెడ్డి గతంలో అనువాద చిత్రంగా ‘సింధూరపువ్వు’ను రిలీజ్ చేసి అతిపెద్ద విజయాన్ని సాధించి తెలుగునాట ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డిగా ప్రాముఖ్యతను పొందారు. ఆ తరువాత ఆయన విడుదల చేసిన మరొక అనువాద చిత్రం ‘సాహసఘట్టం’ కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ‘పులిమురుగన్’ చిత్రాన్ని సైతం కృష్ణారెడ్డి తెలుగునాట పెద్ద హిట్ చేస్తారని మళయాల వెర్షన్ నిర్మాత తోమిచమ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అలానే మల్లూవుడ్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతున్న మోహన్ లాల్ ‘పులి మురుగన్’.. ‘మన్యంపులి’గా తెలుగునాట కూడా తిరుగులేని విజయం సాధిస్తుందని తెలుగు చిత్ర పరిశ్రమ భావిస్తోంది. జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు దర్శకుడు : వైశాఖ, కథ: ఉదయకృష్ణ, సంగీతం: గోపీ సుందర్, కెమెరా: షాజీకుమార్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!