మరో తమిళ చిత్రంలో సమంత!

ఈ మధ్యకాలంలో సమంత సినిమాల్లో నటించడం బాగా తగ్గించింది. దానికి కారణలేవైనా..
సరే అమ్మడు మాత్రం కథలు నచ్చకపోవడం వలనే నటించట్లేదని స్టేట్మెంట్ ఇచ్చింది. తాజాగా
ఓ తమిళ చిత్రంలో నటించడానికి అంగీకరించిన సామ్ ఇప్పుడు మరో తమిళ మల్టీస్టారర్
సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్యాగరాజన్ కుమార్ రాజా అనే
దర్శకుడు రూపొందిస్తున్న ఓ మల్టీస్టారర్ చిత్రంలో హీరోయిన్ గా సమంతను సంప్రదించగా
ఆమెకు కథ నచ్చడంతో ఓకే చెప్పేసిందట. ఈ సినిమాలో హీరోలుగా విజయ్ సేతుపతి, ఫాహద్
ఫాజిల్ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు
జరుగుతున్నాయి. తొలి చిత్రానికే నేషనల్ అవార్డ్ అందుకున్నే త్యాగరాజన్ డైరెక్ట్ చేస్తోన్న
సినిమా కావడంతో ఇప్పటినుండే సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates