మరోసారి చరణ్ తో బన్నీ!

మరోసారి చరణ్ తో బన్నీ!
రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘దృవ’ అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 
ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు మరో మెగాహీరో అల్లు అర్జున్ కూడా కనిపించనున్నాడని 
ఫిల్మ్ నగర్ గానం. నిజానికి ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ వారు నిర్మిస్తున్నారు. సొంత ప్రొడక్షన్ కావడం, 
తనకు ‘రేసుగుర్రం’ వంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన సురేందర్ రెడ్డి అడగడంతో బన్నీ 
కాదనలేకపోయాడట. దీంతో సినిమాలో గెస్ట్ రోల్ లో చేయడానికి బన్నీ సిద్ధమయ్యాడని టాక్. 
గతంలో రామ్ చరణ్ చేసిన ఎవడు సినిమాలో కూడా బన్నీ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించాడు. 
ఆ సినిమా మంచి విజయాన్నే సాధించింది. మరోసారి వీరిద్దరు కలిసి వెండితెరపై కనిపించి 
ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. తని ఒరువన్ చిత్రానికి రీమేక్ గా వస్తోన్న ఈ 
సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా హిట్ కు బన్నీ ఎంత వరకు హెల్ప్ 
అవుతాడో చూడాలి!