HomeTelugu Big Stories'తమన్నా' వల్ల 5 కోట్లకుపైగా నష్టం వచ్చింది: మాస్టర్ చెఫ్ నిర్వాహకులు

‘తమన్నా’ వల్ల 5 కోట్లకుపైగా నష్టం వచ్చింది: మాస్టర్ చెఫ్ నిర్వాహకులు

Tamanna
మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ స్టాటస్ సంపాదించింది. అయితే ఇపుడు ఆమె డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. జెమినీ టీవీలో ‘మాస్టర్ చెఫ్’ కార్యక్రమం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌కి తమన్నా దీనికి హోస్ట్ గా చేస్తోంది. అయితే తమన్నాతో ఈ షోకు రేటింగ్ రాకపోవడం.. ఆమె యాంకరింగ్ అంతగా బాగా లేదన్న విమర్శల నేపథ్యంలో సడెన్ గా మాస్టర్ చెఫ్ నిర్వాహకులు తమన్నాను తొలగించి.. యాంకర్ అనసూయను తీసుకోవడం సంచలనమైంది.ఈ మార్పు చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి పలు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే మాస్టర్ చెఫ్ నిర్వాహకులు దీనిపై వివరణ ఇస్తూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

Tamanna1‘మాస్టర్ చెఫ్’ లో హోస్ట్ చేసేందుకు రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చేలా తమన్నాతో అగ్రిమెంట్ చేసుకున్నామని నిర్వాహకులు తెలిపారు. జూన్ 24 నుంచి సెప్టెంబర్ చివరి వరకు మొత్తం 18 రోజులు షోకు హోస్ట్ గా వ్యవహరించేందుకు తమన్నాతో అగ్రిమెంట్ పై సంతకం చేశారని చెప్పారు.

అయితే ఆమెకు ఇతర కమిట్ మెంట్ల వల్ల కేవలం 16 రోజులు మాత్రమే షూటింగ్ కు వచ్చారని.. రెండు రోజులు రాలేదని తెలిపారు. ఈ రెండు రోజులు ఆమె షూటింగ్ కు రాకపోవడం వల్ల 300 మంది టెక్నీషియన్లు పనిచేస్తోన్న తమకు రూ. 5 కోట్లకుపైగా నష్టం వచ్చిందిన వెల్లడించారు. ఆమెకు అప్పటికే రూ.1.56 కోట్ల పేమెంట్ చేశామని.. చివరి రెండు రోజులు షూటింగ్ కూడా పూర్తి చేసి ఉంటే మిగిలిన పేమెంట్ చేసేవాళ్లమని తెలిపారు.

Tamanna2

అగ్రిమెంట్ ప్రకారం షూటింగ్ పూర్తి చేయకుండా సెకండ్ సీజన్ అడ్వాన్స్ కావాలని తమన్నా డిమాండ్ చేసిందని.. అసలు సెకండ్ సీజన్ కు ఆమెను తీసుకోవాలని తాము అనుకోలేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. తమన్నా అంశానికి సంబంధించి ఏ వార్త రాయాలన్న మీడియా తమను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.

Tamanna3

ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ మూవీలో తమన్నాని హీరోయిన్ గా ఎంచుకున్నారు. ఐతే.. మూవీ టీమ్ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారన్న వార్తలొస్తున్నాయి. మెగాస్టార్ భారీ ప్రాజెక్ట్ నుంచి తమన్నా తప్పుకుంది అని ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. తమన్నాపై వస్తోన్న ఈ రూమర్స్ పై ఎలా స్పందిస్తాదో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!