ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణను ఒప్పుకోను!

నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను తెరపై ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ కథను డైరెక్ట్ చేయనున్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా చేయడానికి ఆయన భార్య లక్ష్మీపార్వతి అంగీకరించారు. ఎన్టీఆర్ యధార్ధగాథను తెరపై ఖచ్చితంగా చూపించగలనన్న నమ్మకం ఉంటేనే చేయాలని రామ్ గోపాల్ వర్మకు సూచించారు. మంగళవారంవిలేకర్లతో మాట్లాడినా ఆమె.. ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ హీరో అయితే ఒప్పుకునే ప్రసక్తే లేదని అన్నారు.

ఆయన పాత్రను కమల్ హాసన్ వంటి నటులు పోషిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. సినిమాల ద్వారా రాంగోపాల్ వర్మ వివాదాలు సృష్టిస్తారని, కానీ ఎన్టీఆర్ సినిమాను యథార్థంగా తీస్తే వర్మపై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకుంటానని లక్ష్మీపార్వతి అన్నారు. నాన్న సినిమాలో నేనే హీరో అని ఇదివరకే ప్రకటించిన బాలయ్య ఇప్పుడు లక్ష్మిపార్వతి మాటలపై ఎలా స్పందిస్తారో… చూడాలి!