‘మత్తు వదలరా’ ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన ఎన్టీఆర్‌

ప్రముఖ గాయకుడు కీరవాణి కుమారుడు సింహ కోడూరు హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేశారు.

ఈ ఫస్ట్ లుక్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ కావడం విశేషం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రను సింహ కోడూరి పోషించారు. న్యూసెన్స్ అనే పేపర్ పై బోర్లా పడుకొని ఉన్న ఫోటో అది. టైటిల్ ను వైఫై టైప్ లో డిజైన్ చేశారు. టైటిల్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉండటం విశేషం.