మీరాజాస్మిన్ కు మూడో పెళ్లి..?

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలకు కొదవేమీ లేదు. ఆ ప్రేమలు పెళ్లి వరకు వెళ్ళినా.. విడిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. అందరూ అలా ఉంటారని చెప్పలేకపోయినా.. ఎక్కువ శాతం మంది ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం ఇదే తంతు. నటి మీరాజాస్మిన్ గుర్తుంది కదా! పవన్ కల్యాణ్ తో ‘గుండుంబా శంకర్’ సినిమాలో కూడా నటించింది.
 
ఈ మధ్య ఆమె తెలుగు తెరపై కనిపించలేదు. మొన్నామధ్య ‘ది ఐస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. అమ్మడుకి పెద్దగా ఒరిగిందేమీ లేదు. నటిగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే మీరా, మాండలిన్ రాజేష్ అనే సంగీత విధ్వాంసుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
 
ఆ బంధం విడిపోవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. రాజేష్ తో విడాకులు తీసుకున్న వెంటనే అనిల్ జాన్ అనే మరో వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకొంది. జాన్ కు కూడా అది రెండో వివాహమే. అప్పట్లో వీరిద్దరి పెళ్లిపై చాలా గొడవలు జరిగాయి. అయితే తాజాగా వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సంవత్సర కాలంగా మీరా, జాన్ లు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే ఈ విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో.. అప్పటినుండి మీరాకు మరో వ్యక్తితో ఎఫైర్ ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. విడాకులు తీసుకున్న అనంతరం మూడో పెళ్లి చేసుకోవడానికి కూడా ఆమె సిద్ధమే అంటూ.. ఆమెను దగ్గరగా చూసిన వారు చెబుతున్నారు.