‘మీట్‌ క్యూట్‌’ ట్రైలర్‌


నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్న ఆంథాలజీ సిరీస్ “మీట్ క్యూట్”. నాని సోదరి దీప్తి ఘంటా ఈ సిరీస్ తో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. ఇటీవల వచ్చిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్ ట్రైలర్ ను ఈరోజు లాంచ్ చేసారు.

“మీట్ క్యూట్” టీజర్ లో అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేయడంతో పాటుగా.. అన్ని రకాల భావోద్వేగాలను చూపించారు. ఇప్పుడు నాని వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్‌ ప్రారంభమైంది. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని ‘మీట్ క్యూట్’ చిత్రాన్ని నిర్మించారు. సత్యరాజ్ , రోహిణి మొల్లేటి , అదా శర్మ, వర్షా బొల్లమ్మ , ఆకాంక్ష సింగ్ , రుహాని శర్మ , సునయన, సంచిత, అశ్విన్ కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి , గోవింద్ పద్మసూర్య , రాజా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సోనీ లివ్ ఓటీటీలో నవంబర్ 25 నుండి స్ట్రీమింగ్ కాబోతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

CLICK HERE!! For the aha Latest Updates