‘భీష్ముడి’గా బాలకృష్ణ

టాలీవుడ్‌ హీరో నందమూరి బాలకృష్ణ పౌరాణిక, జానపద చిత్రాల్లోనూ నటించి మెప్పించగలడు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన పలు పౌరాణిక పాత్రల్లో నటించి మెప్పించారు. డైలాగ్‌లు చెప్పడంలోనూ బాలయ్యకు ఆయనే సాటి. ఈ రోజు (మంగళవారం) భీష్మ ఏకాదశి సందర్భంగా అరుదైన చిత్రాలను ఆయన అభిమానులతో పంచుకున్నారు. తండ్రి ఎన్టీఆర్‌ జీవితకథ ఆధారంగా బాలకృష్ణ ‘ఎన్టీఆర్‌: కథానాయకుడు’, ‘ఎన్టీఆర్‌: మహానాయకుడు’ చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సినీ జీవితంలో తన తండ్రి పోషించిన పాత్రలను ఈ చిత్రాల్లో బాలకృష్ణ పోషించారు. అలాంటి వాటిలో భీష్ముడి పాత్ర ఒకటి. అయితే అది సినిమాలో లేదు. నిడివి కారణంగా ఈ సన్నివేశాలను తొలగించాడు. మంగళవారం భీష్మ ఏకాదశి సందర్భంగా భీష్ముడి గెటప్‌లో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates