మెగడాటర్ ఎన్టీఆర్ కోసం వెయిటింగ్!

మెగడాటర్ ఏంటి ఎన్టీఆర్ కోసం వెయిట్ చేయడం ఏంటి..? అనుకుంటున్నారా…? ఇటీవల
ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమయిన నీహారిక కొణిదలకు
ఈ సినిమా ఆశించిన రెస్పాన్స్ ను రాబట్టలేకపోయింది. దీంతో అమ్మడు కాస్త డిప్రెషన్ లోకి
వెళ్ళిందనే చెప్పాలి. అయితే ఇప్పుడిప్పుడే సినిమా కథలను వింటోంది. ఈసారి ఎలా అయినా
హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ ను టార్గెట్ చేసింది. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తేనే.. టాప్
హీరోయిన్ గా ఎదగగలనని భావించి తారక్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు మొదలు
పెట్టింది. గతంలో ఓ సారి ఎన్టీఆర్ అంటే ఇష్టమని చెప్పిన ఈ బ్యూటీ ఇప్పుడు ఆయనతో
జత కట్టే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. మెగా ప్రిన్సెస్ ఐడియా వరకు బాగానే ఉంది.. మరి
యంగ్ టైగర్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.. చూడాలి!