సింపుల్‌గా నిహారిక నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్


మెగా డాటర్‌, నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్ధం నేడు హైదరాబాద్‌లో జరిగింది. గుంటూరు జిల్లా పోలీస్ అధికారి కుమారుడు చైతన్య‌తో నిహారిక వివాహం జ‌ర‌గ‌బోతుంది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్ళి .. కాగా తనకు కాబోయే వరుడిని నిహారిక సోషల్ మీడియా వేదిక‌గా ‘నావాడు అంటూ’ ఇదివ‌ర‌కే ప‌రిచ‌యం చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు జరిగిన ఈ వేడుకకి మెగా ఫ్యామిలీ హాజరయింది. కాగా మెగా డాటర్ నిశ్చితార్ధం సింపుల్‌గా జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిహారిక పెళ్లి కుదిరినప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ తమ అభిమాన మెగా హీరోలందరినీ ఒకే వేదిక పై చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలే లాక్ డౌన్ వల్ల తమ అభిమాన హీరోలు కనిపించక అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వేడుకకి మెగా ఫ్యామిలీ తప్ప ఇండస్ట్రీలో ఎవ్వరూ హాజరు కాలేదని తెలుస్తుంది.

CLICK HERE!! For the aha Latest Updates