మెగాహీరో సినిమాలో అనసూయ!

బుల్లితెరపై యాంకర్ గా క్రేజ్ ను సంపాదించుకున్న అనసూయ ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంతో నటిగా మారింది.
క్షణం సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించి సీరియస్ తరహా పాత్రల్లో కూడా మెప్పించగలనని నిరూపించింది.
ప్రస్తుతం అమ్మడు చేతిలో రెండు, మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే అటు సినిమాల్లో నటిస్తూనే.. స్పెషల్
సాంగ్స్ చేయడానికి కూడా సిద్ధపడుతోంది. సాయి ధరమ్ తేజ్, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న
‘విన్నర్’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం అనసూయను సంప్రదించినట్లు తెలుస్తోంది. దానికి అనసూయ
కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ సినిమాలో ఈ పాట ఒక హైలైట్ గా నిలుస్తుందని
చెబుతున్నారు. మరి ఈ పాటతో అమ్మడుకి మరెన్ని స్పెషల్ సాంగ్స్ ఆఫర్స్ వస్తాయో.. చూడాలి!