
హీరో వరుణ్ తేజ్.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట్లో కాస్త కంగారు పడినా కూడా తర్వాత మెల్లగా తనకంటూ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు వరుణ్ తేజ్. వరస విజయాలతో దూసుకుపోతున్నాడు ఈ మెగా హీరో. ఇప్పుడు ఈయన చేస్తున్న సినిమాలపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈయన కిరణ్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో ఆయన పెద్ద కొడుకు బాబీ నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ మధ్యే గద్దలకొండ గణేష్ సినిమాతో విజయం అందుకున్నాడు ఈయన.
కిరణ్ తెరకెక్కించబోయే సినిమా బాక్సింగ్ నేపథ్యంలో సాగనుండటంతో ప్రస్తుతం అదే పనితో బిజీగా ఉన్నాడు వరుణ్ తేజ్. ఈ క్రమంలోనే తన బలం ఎవరో.. బలగం ఎవరో తెలిపాడు వరుణ్ తేజ్. తన నాన్న నాగబాబుతో పాటు పెదనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కల్యాణ్ ఫోటోలు పోస్ట్ చేసాడు వరుణ్ తేజ్. వీళ్లే నా బలం అంటూ పోస్ట్ చేసాడు. ఇది చూసి మెగా ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. ఇక మొన్నీమధ్యే చిన్నప్పటి ఫోటోలను కూడా పోస్ట్ చేసాడు వరుణ్ తేజ్. అందులో సాయి ధరమ్ తేజ్, వరుణ్, చరణ్, బన్నీ ఉన్నారు. మొత్తానికి ఇంట్రెస్టింగ్ ట్వీట్స్‌తో మరోసారి వార్తల్లో నిలిచాడు వరుణ్ తేజ్.
My strength!#love pic.twitter.com/LZxocXqCh1
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) December 4, 2019













