
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ -విజయ్ సేతుపతి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘మైఖేల్’. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. స్టన్నింగ్ విజువల్స్‌తో రూపొందించిన మైఖేల్ టీజర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. శ్యామ్ సీఎస్ కంపోజ్ చేసిన బీజీఎం సినిమాపై క్యూరియాసిటీ రేకెత్తిస్తోంది.
దివ్యాంక కౌశిక్, అనసూయ గ్లామరస్ రోల్స్, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపిస్తుండగా.. గౌతమ్ మీనన్, వరుణ్ సందేశ్, విజయ్ సేతుపతి స్టన్నింగ్ పర్‌ఫార్మెన్స్ తో అదరగొట్టబోతున్నట్టు టీజర్‌తో తెలిసిపోతుంది. రంజిత్ జయకోడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ ఇదివరకెన్నడూ కనిపించని లుక్‌తో కనిపిన్నాడు.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్లపై పీ రామ్‌మోహన్ రావు, భరత్ చౌదరీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.













