HomeTelugu Big Storiesసుశాంత్‌ చివరి సినిమా ‘దిల్‌ బేచారా’ ట్రైలర్‌..

సుశాంత్‌ చివరి సినిమా ‘దిల్‌ బేచారా’ ట్రైలర్‌..

5 4

బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్ చివరిగా నటించిన చిత్రం ‘దిల్‌ బేచారా’. ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ సినిమాలో సంజనా సంఘి నటించింది. సంజనా కూడా ట్రైలర్ రీలీజ్ కు సంబంధించిన పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. తనకు ఎంతో ఇష్టమైన సన్నివేశాల్లో ఆ పోస్ట‌ర్ లో ఉన్న‌ది ప్ర‌ధాన‌మైనది అని పేర్కొంది.

ఈ ట్రైలర్‌లో ‘ఎలా పుట్టాలి ఎప్పుడు చావాలి అన్నది మనం నిర్ణ‌యించ‌లేదం.. కానీ ఎలా బతకాలన్నది మాత్రం మన చేతుల్లో ఉంటుంది’ అంటూ సుశాంత్ చెప్పిన డైలాగ్‌ మనస్సుని హాత్తుకుంటుంది. ఇందులో హీరోయిన్‌కు క్యాన్సర్ ఉంటుంది. కానీ ఆమెను కలిసిన హీరో ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఆమె కోరికలన్నీ తీరుస్తుంటాడు. ఈ ట్రైలర్‌లో సుశాంత్‌ నటన చూస్తుంటే.. ఇంత మంచి యాక్ట‌ర్.. ఎందుకు అంద‌రికీ దూరం అయ్యాడా అని భావన క‌లుగుతుంది. నిజంగానే సుశాంత్ జీవితమే సినిమాగా తీశారా అన్నట్లుగా తోస్తుంది. ఇక ఈ సినిమా జూలై 24న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. అయితే ఎలాంటి సబ్‌స్క్రిప్షన్‌ చార్జీలు లేకుండా ఫ్రీగా అందరికి అందుబాటులో ఉండనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!