HomeTelugu Trending'సైరా' పై మెహన్‌ బాబు ట్వీట్‌

‘సైరా’ పై మెహన్‌ బాబు ట్వీట్‌

4టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన భారీ బడ్జెట్‌ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా బుధవారం (అక్టోబర్‌ 2) గాంధీ జయంతి రోజున ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రం ఘన విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తాజాగా ప్రముఖ నటుడు మోహన్‌బాబు సైరా సినిమాకి బెస్ట్‌ విషెస్‌ తెలియజేశారు. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ‘నా మిత్రుడు చిరంజీవి మంచి నటుడు, తన కుమారుడు చరణ్‌ అధిక వ్యయంతో తీసిన సినిమా ‘సైరా’. ఇది అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని.. నిర్మాత చరణ్‌కు, చిరంజీవికి డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు తేవాలని మనసా వాచా కోరుకుంటున్నాను’ అని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu