HomeTelugu Trending'సన్ ఆఫ్ ఇండియా' గా మోహన్‌ బాబు

‘సన్ ఆఫ్ ఇండియా’ గా మోహన్‌ బాబు

Mohan Babu as Son of India

విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. గతంలో ‘మేజర్ చంద్రకాంత్’ ‘పుణ్యభూమి నా దేశం’ వంటి ఎన్నో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మంచు మోహన్ బాబు మరోసారి దేశభక్తిని చాటిచెప్పబోతున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాటల రచయత డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేయబోతున్నాడు. దేశభక్తి నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోందని అర్ధమవుతుంది. ఈ సినిమాకు సంబందించిన పూర్తివివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు మంచు మోహన్ బాబు తమిళ హీరో సూర్య నటిస్తున్న ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu