HomeTelugu Trendingమాల్దీవుల్లో మోహన్‌ బాబు ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్‌

మాల్దీవుల్లో మోహన్‌ బాబు ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్‌

Mohan babu Relaxing with fa

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తాజాగా తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి మాల్దీవులకు వెకేషన్ కోసం వెళ్లారు. ఈ ట్రిప్‌లో కేవలం మోహన్ బాబు దంపతులకు మాత్రమే కాకుండా వారి కూతురు లక్ష్మీప్రసన్న, అల్లుడు శ్రీనివాసన్, మనవరాలు విద్య నిర్వాణ కూడా ఉన్నారు. అక్కడ సముద్రపు ఒడ్డున సేద తీరుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ ఫొటోలో మోహన్ బాబు ఆయన భార్య నిర్మలతో ఇసుక తిన్నెలపై కూర్చొని సూర్యాస్తమయం వేళలో సేదతీరున్నారు. ఇక మోహన్ బాబు చొక్కా షార్ట్ ధరించగా ఆయన భార్య పంజాబీ డ్రెస్ ధరించి భర్త భుజాలపై వాలింది. ఇద్దరూ కెమెరా వైపు చూస్తూ స్మైల్ ఇస్తున్న ఈ మంచువారి సీనియర్ కపుల్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

Mohan babu in Maldives

Mohan babu

Recent Articles English

Gallery

Recent Articles Telugu