వదంతులపై మోహన్‌బాబు స్పందన

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా ప్రముఖ నటుడు, వైసీపీ నేత మోహన్‌బాబును నియమించనున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. మీడియా వర్గాలు ఇలాంటి వదంతులు రాయొద్దని కోరారు.

‘టీటీడీ ఛైర్మన్‌ పదవి రేసులో నేనున్నానని వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయంలో నాకు కొన్నిరోజులుగా ఫోన్లు వస్తున్నాయి. నా కోరిక ఒక్కటే. జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాను. ఆయన చేసే ప్రజాసేవకు నా వంతు సాయం చేయాలనుకుంటున్నాను. జగన్‌పై నమ్మకంతోనే నేను మళ్లీ రాజకీయాల్లోకి వచ్చాను. అంతేకానీ ఎలాంటి పదవులు ఆశించి కాదు. మీడియా వర్గాలు ఇలాంటి వదంతులు సృష్టించవద్దని కోరుతున్నాను’ అని మోహన్‌బాబు స్పష్టం చేశారు.