స్టార్‌ హీరో సినిమా ముహూర్తం ఫిక్స్‌!

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ తాజాగా నటించిన చిత్రం సర్కార్‌. ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ భారీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని పలు వివాదాల మధ్య దీపావళికి సందడి చేయడానికి రెడీ అవుతోంది. కీర్తీసురేశ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సంచలన నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ రాజకీయనాయకురాలిగా ముఖ్యపాత్రలో నటించింది.

రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకుంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే విజయ్‌ తదుపరి చిత్రానికి రెడీ అయిపోతున్నారు. తదుపరి ఆయన్ని దర్శకత్వం చేసే అవకాశం ఎవరికి లభిస్తుంది. ఏ చిత్ర నిర్మాణ సంస్థకు కాల్‌షీట్స్‌ ఇవ్వనున్నారు అనే ఆసక్తి చిత్ర పరిశ్రమలో నెలకొంది. విజయ్‌ తదుపరి చిత్రం గురించి కొన్ని వివరాలు అనధికారికంగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా విజయ్‌ తదుపరి అట్లీ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారన్నది.

వీరి కాంబినేషన్స్‌లో ఇంతకు ముందు తేరి, మెర్సల్‌ చిత్రాలు వచ్చి సంచలన విజయాన్ని సాధించాయి. తాజాగా విజయ్, అట్లీల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రాన్ని ఏజీఎస్‌ సంస్థ నిర్మించనున్నట్లు తెలిసింది. అంతేకాదు ఈ చిత్ర ప్రారంభానికి వచ్చే ఏడాది జనవరిలో ముహూర్తం పెట్టినట్లు సమాచారం. ఇక అన్నింటికంటే ముఖ్యం దీనికి ఆళపోరాన్‌ తమిళన్‌ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు తెలిసింది. ఈ టైటిల్‌ను దర్శకుడు అట్లీ చాలా కాలం క్రితమే రిజిస్టర్‌ చేశారు.

CLICK HERE!! For the aha Latest Updates