మోహన్ బాబు ఈవెంట్ కు గెస్ట్ గా చిరు!

లెజండరీ యాక్టర్ మోహన్ బాబు నటుడిగా నలభై వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ సంధార్భాన్ని
పురస్కరించుకొని వారి తనయులు కొన్ని ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తుండగా.. టి.సుబ్బిరామిరెడ్డి
ఆధ్వర్యంలో ‘లలిత కళా పరిషత్’ వారు మోహన్ బాబుని ‘నవరస నటతిలకం’ అనే అవార్డును
అందించనున్నారు. ఈ నెల 17న వైజాగ్ లో మున్సిపాల్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని గ్రాండ్
గా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి దాసరి వంటి సీనియర్ డైరెక్టర్ తో పాటు వెంకటేష్,
నాగార్జున, శ్రీదేవి, జయసుధ వంటి ప్రముఖ సినీ తారలు హాజరు కానున్నారు. అయితే ముఖ్య
అతిథిగా చిరంజీవిని కూడా ఆహ్వానించారు. ఆయన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా షూటింగ్ లో
ఎంత బిజీగా ఉన్నప్పటికీ మోహన్ బాబు కోసం తన సమయాన్ని వెచ్చించాలని డిసైడ్ అయినట్లు
తెలుస్తోంది. దీంతో వీరిద్దరి మధ్య ఎంత మంచి అనుబంధం ఉందో అర్ధమవుతుంది.

CLICK HERE!! For the aha Latest Updates