వైసీపీ చేరిన మోహన్‌బాబు


ప్రముఖ సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల అధినేత మోహన్‌బాబు వైసీపీలో చేరారు. లోటస్‌పాండ్‌లో ఆ పార్టీ అధినేత జగన్‌ను ఆయన మంగళవారం ఉదయం కలిశారు. జగన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వ్యవహారంలో ఇటీవలే అధికార టీడీపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన మోహన్‌బాబు కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.