‘వినయ విధేయ రామ’ ఫస్ట్‌ సాంగ్‌

మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈ సినిమాని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నారు. కైరా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వివేక్‌ ఒబెరాయ్‌‌, ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులోని ప్రత్యేక గీతంలో ఇలియానా నటించనున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది.

ఈ సినిమాలోని ఫస్ట్‌ సాంగ్‌ను సోమవారం విడుదల చేశారు. ‘తందానే తందానే.. చూశారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే.. తందానే తందానే.. కన్నారా ఎవరైనా ప్రతి రోజు పండగనే..’ అని సాగే ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. ‘బంధాల గ్రంథాలయమే ఉందీ ఇంట్లోనే..’ అంటూ కుటుంబ విలువలు, మమకారాల్ని ఈ పాటలో వర్ణించారు. ఎమ్‌.ఎల్‌.రామ్‌ కార్తికేయన్‌ ఈ పాటను ఆలపించారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates