HomeTelugu Trendingమోక్షజ్ఞ మూవీ ఎంట్రీ.. హీరోగా కాదంట!

మోక్షజ్ఞ మూవీ ఎంట్రీ.. హీరోగా కాదంట!

Mokshagna Debut Update

బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ పలు వార్తలు కూడా వినిపించాయి. కానీ ఒక్కటి కూడా నిజం కాలేదు. మోక్షజ్ఞకు సినిమాల మీద ఆసక్తి లేదని అందుకే మోక్షజ్ఞ సినిమాలు చేయట్లేదని టాక్ కూడా వినిపించింది.

దీనికి తన లుక్‌ కూడా తోడైయింది. అయితే బాలకృష్ణ మాత్రం వారసుడి ఎంట్రీ పై ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచేలా చెబుతున్నారు. ఈక్రమంలో మోక్షజ్ఞ ఎంట్రీ మూవీకి ముహూర్తం కుదిరిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞతో తొలి సినిమా డైరెక్టర్‌ బోయపాటి శ్రీను అని అంటున్నారు.

అయితే మోక్షజ్ఞ మెయిన్ లీడ్ కాదట. ప్రస్తుతం బోయపాటి రామ్‌ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలకృష్ణతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఆ సినిమా నవంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. అఖండ 2 గా రాబోతున్న ఈ సినిమాలో మోక్షజ్ఞ కోసం కూడా స్పెషల్ రోల్ రాశాడట బోయపాటి శ్రీను. బోయపాటి తో అయితేనే మోక్షజ్ఞ ఎంట్రీ ఒక రేంజ్ లో ఉంటుందని బాలకృష్ణ భావిస్తున్నారు.

బాలకృష్ణ- బోయపాటి కాంబో అంటేనే మాస్ ఆడియన్స్‌కు ఫుల్‌ మిల్స్‌. ఇక ఆ సినిమాలో మోక్షజ్ఞ స్పెషల్‌ ఎంట్రీ అంటే.. ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. మోక్షజ్ఞ మూవీ ఎంట్రీ నందమూరి ఫ్యాన్స్ కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఎదురుచూస్తున్నారు.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu