HomeTelugu TrendingNandamuri Mokshagna సినిమాలో మరొక స్టార్ హీరో కూడా ఉన్నారా?

Nandamuri Mokshagna సినిమాలో మరొక స్టార్ హీరో కూడా ఉన్నారా?

Another star hero in Nandamuri Mokshagna's debut film?
Another star hero in Nandamuri Mokshagna’s debut film?

Nandamuri Mokshagna Debut Movie:

నందమూరి కుటుంబంలో నుండి మరో హీరో తెరంగేట్రం చేయబోతున్నాడు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను తెచ్చుకుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగానే, మోక్షజ్ఞ స్టైలిష్ లుక్ చూసి అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.

నందమూరి అభిమానులు మోక్షజ్ఞను తెరపై చూడటానికి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో ప్రధాన విలన్ పాత్రకు రానా దగ్గుబాటిని సంప్రదించినట్లు తెలుస్తోంది. రానా ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తూ, విలన్ పాత్రలను కూడా అత్యంత ఇంపాక్ట్‌ఫుల్‌గా చేసారు. రీసెంట్‌గా విడుదలైన రజనీకాంత్ నటించిన “వెట్టయ్యన్” చిత్రంలో రానా విలన్ గా మెప్పించారు.

ఈ నేపథ్యంలో.. మోక్షజ్ఞ డెబ్యూ చిత్రంలో కూడా రానా విలన్‌గా నటిస్తే.. ఈ సినిమాపై ట్రేడ్ వర్గాలు మరింత ఆసక్తి చూపించే అవకాశముంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కష్టపడుతున్నారు.

కథ, స్క్రీన్‌ప్లే విషయాల్లో బాలయ్య కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మంచి స్టోరీలైన్‌తో పాటు, మోక్షజ్ఞ ఫస్ట్ లుక్‌ను చూసిన తర్వాత ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. రానా దగ్గుబాటితో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని సమాచారం, కానీ ఇంకా అధికారికంగా ఏమీ ధృవీకరించలేదు. రానా ఈ చిత్రంలో చేరితే, మోక్షజ్ఞకు ఇది పెద్ద ప్లస్ అవుతుంది.

ALSO READ: రాజకీయ ఉద్రిక్తతల నడుమ అమల్లోకి వచ్చిన Hyderabad Curfew

Recent Articles English

Gallery

Recent Articles Telugu