HomeTelugu Trending'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Most eligible bachelor re
టాలీవుడ్‌లో వరుసగా సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటించేస్తున్నారు. ఈ క్రమంలో అక్కినేని యంగ్‌ హీరో అఖిల్‌ నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ రిలీజ్ ప్రకటన వచ్చేసింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని జీఏ 2 బ్యానర్ లో బన్నీ వాసు, వాసువర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జూన్ 19న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. కాగా నాగచైతన్య మూవీ ‘లవ్ స్టోరీ’ ఏప్రిల్ 16న రాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక నాగార్జున మూవీ ‘వైల్డ్ డాగ్’ విడుదల తేదీకి సంబంధించిన ప్రకటనే రావాల్సి ఉంది!

Recent Articles English

Gallery

Recent Articles Telugu