HomeTelugu Trendingమిలియన్‌ డాలర్లతో సమంత 'ఓ బేబీ'

మిలియన్‌ డాలర్లతో సమంత ‘ఓ బేబీ’

8 18ప్రముఖ నటి సమంత సోలోగా అమెరికాలో మిలియన్‌ డాలర్లు రాబట్టేశారు. ఆమె టైటిల్‌ రోల్‌ పోషించిన చిత్రం ‘ఓ బేబీ’. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 5న విడుదలై విజయం అందుకుంది. విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు సైతం అందుకుంది. బాక్సాఫీసు వద్ద కూడా విశేషమైన వసూళ్లు రాబడుతోంది. కాగా ఈ చిత్రం అమెరికాలో వన్‌ మిలియన్‌ డాలర్ల మార్కును దాటినట్లు చిత్ర నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్‌ వెల్లడించింది. సమంత సినిమా మిలియన్‌ డాలర్ల మార్కు చేరుకోవడం ఇది తొలిసారి కాదు. కానీ హీరో లేకుండా సోలోగా నటించిన ఈ చిత్రం అమెరికాలో ఈ ఘనత సాధించడం విశేషమని విశ్లేషకులు అంటున్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.35 కోట్లకుపైగా రాబట్టింది. ఇందులో నాగశౌర్య, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించారు.

సమంత స్థాపించిన ప్రత్యూష ఫౌండేషన్‌కు చెందిన చిన్నారుల కోసం శనివారం ‘ఓ బేబీ’ సినిమా ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేశారు. పిల్లలు సినిమా చూసి, ఎంజాయ్‌ చేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu