
Arijit Singh Net Worth:
మన మనసులు జాక్ కూడా పాటలు పడతాయి ఆయన పాటలు వింటే! ఆయన ఎవరో కాదు — అరిజిత్ సింగ్. ఏప్రిల్ 25న తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్న అరిజిత్, ఇప్పుడు భారతదేశంలోనే టాప్ సింగర్. హిందీ, తెలుగు, బెంగాలీ, మరాఠీ… అన్నీ భాషల్లోనూ ఆయన పాటలు మనకు దగ్గరగానే ఉంటాయి.
అరిజిత్ ఇప్పటివరకు 300కి పైగా పాటలు పాడారు. “తుమ్హీ హో” లాంటి పాటలతో దేశం మొత్తం ఊగిపోయింది. రొమాంటిక్ పాటలంటే గుర్తొచ్చేది ఆయనే. సినిమా రంగంలో అరిజిత్ అనేది ఒక బ్రాండ్ అయిపొయింది.
అబ్బా, పాటలు మాత్రమే కాదు – ఆస్తులు కూడా జెట్ స్పీడ్‌లో పెరిగిపోయాయి. అరిజిత్ నెట్ వర్త్ ఇప్పుడు ఏకంగా రూ. 414 కోట్లు! ఒక్క బాలీవుడ్ పాటకే ఆయన రూ. 10 లక్షలు తీసుకుంటారు. లైవ్ షోలకు అయితే రూ. 50 లక్షల నుంచి రూ. 1.5 కోట్లు వసూలు చేస్తారు.
గ్లామరస్ ప్రపంచంలో ఉన్నా… వ్యక్తిగతంగా చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ ఆయన ప్రాపర్టీ లిస్ట్ చూస్తే మాత్రం ఓ మాధ్యం! ముంబై వర్సోవాలో నాలుగు విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు ఉన్నాయని, ఒక్కోటి దాదాపు రూ. 9 కోట్లు విలువనట. అంతే కాదు, రేంజ్ రోవర్, హమ్మర్, మెర్సిడెస్ బెంజ్ లాంటి కార్లను కూడా ఆయన కలెక్షన్‌లో పెట్టుకున్నారు.
అరిజిత్ ప్రస్థానం కూడా ఇంట్రెస్టింగ్. మొదటగా Fame Gurukul అనే రియాలిటీ షోతో ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆయనకు నిజమైన గుర్తింపు 10 కె 10 లే గయే దిల్ గెలిచాక వచ్చింది. ఆయన కెరీర్‌ను మార్చేసిన మ్యూజికల్ మైలురాయి మాత్రం 2013లో వచ్చిన తుమ్ హీ హో!
ఇప్పుడు పాటల జాబితా పెరుగుతూనే ఉంది… ప్రేమలో ఉన్నవాడైనా, బ్రేకప్ అయినవాడైనా – అరిజిత్ పాటలు విని కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేరు!