HomeTelugu Newsఅఖిల్‌ 'మిస్టర్‌ మజ్ను' ట్రైలర్‌

అఖిల్‌ ‘మిస్టర్‌ మజ్ను’ ట్రైలర్‌

5 1యంగ్‌ హీరో అఖిల్ నటిస్తున్న సినిమా ‘మిస్టర్‌ మజ్ను’. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను బుధవారం సాయంత్రం విడుదల చేశారు.

‘దీని ఇంట్లో రాత్రి 11.30 గంటలకు ఏం చేస్తున్నావ్‌?’ అని ఓ మహిళ ప్రశ్నించగా.. ‘మీరు స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఒత్తిడిగా ఫీల్‌ అయినప్పుడు ఏం చేసేవారు?’ అని ఆమెను అఖిల్‌ ఎదురు ప్రశ్నించే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. ‘క్రేజీ క్యారెక్టర్‌ కదా?’ అని నటి విద్యుల్లేఖ అంటే.. ‘లేదు.. డేంజరస్‌ క్యారెక్టర్’ అని నిధి బదులిచ్చారు. ‘ప్రపంచంలోని అందరు అమ్మాయిలు నా ఒక్కడి కోసమే పుట్టలేదు.. వాళ్లకీ ఓ జీవితం ఉంటుంది. దాన్ని నేను గౌరవిస్తా..’ అని అఖిల్‌ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ ముగిసింది. ఆసక్తికరంగా ఈ ట్రైలర్‌ను రూపొందించారు. ఈ సినిమాలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జనవరి 25న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!