HomeTelugu Big Storiesముగ్గురు మొనగాళ్లు ట్రైలర్‌

ముగ్గురు మొనగాళ్లు ట్రైలర్‌

Mugguru monagallu movie tr
టాలీవుడ్‌ నటులు శ్రీనివాస్ రెడ్డి, కన్నడ హిట్ మూవీ ‘దియా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి – వెన్నెల రామారావు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ముగ్గ‌రు మొన‌గాళ్లు’. అభిలాష్ రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామారావు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ముగ్గురు మొనగాళ్లు’ ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ ట్రైలర్ లో శ్రీనివాస్ రెడ్డి చెవిటివాడిగా.. దీక్షిత్ శెట్టి మూగవాడిగా.. వెన్నెల రామారావు అంధుడిగా మూడు ప్రధాన పాత్రదారులను పరిచయం చేశారు. ఓ ఆసక్తికర అంశంతో ఈ ‘ముగ్గురు మొనగాళ్లు’ చిత్రం తెరకెక్కిన్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. నాజర్, రాజా రవీంద్ర, బద్రామ్, జబర్దస్త్ సన్నీ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ‘ముగ్గురు మొనగాళ్ళు’ సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu