HomeTelugu Trendingశ్రీనివాస్‌ రెడ్డి 'ముగ్గురు మొనగాళ్లు' ఫస్ట్‌లుక్‌

శ్రీనివాస్‌ రెడ్డి ‘ముగ్గురు మొనగాళ్లు’ ఫస్ట్‌లుక్‌

Mugguru monagallu first loo

టాలీవుడ్‌ నటుడు శ్రీనివాస్‌ రెడ్డి.. ఓవైపు కమెడియన్ గా చేస్తూనే అప్పుడప్పుడు హీరోగా సినిమాలు చేస్తుంటాడు. ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి సినిమాలతో హీరోగా ఆకట్టుకున్న శ్రీనివాస్‌ రెడ్డి తాజాగా ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అభిలాష్‌ రెడ్డి డైరెక్షన్‌లో చిత్రమందిర్‌ స్టూడియోస్‌ పతాకంపై అచ్యుత్‌ రామారావు ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్‌ రెడ్డి మెయిన్ లీడ్‌ రోల్‌ చేస్తుండగా,దీక్షిత్‌ శెట్టి (కన్నడ హిట్‌ మూవీ ‘దియా’ ఫేమ్‌), వెన్నెల రామారావు ప్రధాన పాత్రధారులుగా కనిపించనున్నారు.

తాజాగా ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. శ్రీనివాస రెడ్డి, దీక్షిత్‌ శెట్టి, వెన్నెల రామారావు ఒకే పోస్టర్‌లో ఉన్నారు. ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ ప్రకటించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu