బన్నీ కోసం బాలీవుడ్ ను నమ్ముకున్నారు!

దువ్వాడ జగన్నాథం సినిమాలో నటిస్తోన్న అల్లు అర్జున్, రైటర్ వక్కంతం వంశీ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ధోని సినిమాలో నటించిన కైరా అధ్వానిను తీసుకోవాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్స్ తో బిజీగా ఉన్న కైరా ఈ సినిమాకు డేట్స్ కేటాయించగలదో లేదో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కైరా గనుక డేట్స్ ఇవ్వలేకపోతే దిశా పటానిను తీసుకోవాలనుకుంటున్నారు. అలానే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ విశాల్-శేఖర్ లను తీసుకొనున్నట్లు తెలుస్తోంది. ఇలా బన్నీ సినిమా కోసం ఎక్కువ శాతం బాలీవుడ్ మీదే ఆధారపడ్డారు. ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్, నాగబాబు లు కలిసి నిర్మించబోతున్నారు.