చిరు సినిమాలానే ఎన్టీఆర్ సినిమా..?

గతంలో చిరంజీవి నటించిన ‘ముగ్గురు మొనగాళ్ళు’ సినిమా ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో.. అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి మూడు పాత్రల్లో కనిపించారు. ఒకటి రౌడీ పాత్ర కాగా, మరొకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర. అలానే బ్రాహ్మణ యువకుడిగా కూడా కనిపించాడు. ఒకే
సినిమాలో మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించి మెప్పించారు. సరిగ్గా ఇలానే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా ఉండబోతోందని టాక్.

బాబీ డైరెక్ట్ చేయబోతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, ఆచారి తరహా పాత్రలో అలానే నెగెటివ్ షేడ్ ఉన్న మరో పాత్రలో ఇలా త్రిపాత్రాభినయం చేయబోతున్నాడని అంటున్నారు.

ముఖ్యంగా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని.. నటుడిగా ఎన్టీఆర్ స్థాయిని మరింత పెంచుతుందని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందనే విషయాన్ని చిత్రబృందం వెల్లడించాల్సివుంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.