HomeTelugu Trendingఆ సినిమాతో తన కల నెరవేరిందన్న శ్రద్ధ శ్రీనాథ్

ఆ సినిమాతో తన కల నెరవేరిందన్న శ్రద్ధ శ్రీనాథ్

10 1

జెర్సీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్‌ ప్రస్తుతం తమిళంలో నేర్‌కొండ పార్వై సినిమాలో ముఖ్యపాత్ర పోషించింది. అజిత్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంగురించి మాట్లాడుతూ తన కెరీర్‌లో మరిచిపోలేని సినిమా అని చెబుతోంది. అజిత్‌తో కలిసి నటించాలన్న నా కల నెరవేరింది. ఆయన చాలా మంచి వ్యక్తి. నిజానికి ఈ చిత్రంలో నటించడానికి కొన్ని నెలల క్రితం ఫోన్‌ వచ్చింది. ఆడిషన్స్‌ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. అసలు ఇందులో నటిస్తున్నానా? లేదా? అనే సందేహం కూడా కలిగింది. కొంత కాలం తర్వాత మళ్లీ దర్శకుడు వినోద్‌ నుంచి ఫోన్‌ రావడంతో నేను చాలా ఉత్సాహంగా వెళ్లి నటించా.

శ్రద్ధ శ్రీనాథ్ తమిళంలో విక్రం వేదాలో మాధవన్‌కు జోడీగా నటించి మెప్పించింది. ఇటీవల కే 16 చిత్రంలోనూ నటించింది. ఇక ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు మీ పాత్రను చూస్తే ప్రేక్షకులు మిమ్మల్ని అసహ్యించుకోవాలి. ఆగ్రహం కలగాలి అని దర్శకుడు వినోద్‌ చెప్పారు. అందుకు తగ్గట్టుగానే నటించా. ఈ సినిమాలో నా ప్రతిభను కనబరిచాననే నమ్మకం ఉంది. ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా లభిస్తుందని ఆశిస్తున్నా అని తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu