HomeTelugu Trending'నా సామిరంగ' టీజర్‌ అప్డేట్‌

‘నా సామిరంగ’ టీజర్‌ అప్డేట్‌

Na Saami Ranga Teaser Upd
అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’. ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాతో విజయ్‌ బన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకురానుంది.

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుదలై అప్డేట్స్‌ సినిమాపై ఆసక్తిని కలిగించేలా ఉన్నాయి. దీంతో ఈ సినిమా టీజ‌ర్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో తాజాగా సాలిడ్ అప్‌డేట్ ఇచ్చింది చిత్ర‌బృందం.

ఈ మూవీ టీజ‌ర్‌ను రేపు మధ్యాహ్నం 12.34 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu