HomeTelugu Big Storiesఒకే సారి జయలలిత పై మూడు బయోపిక్స్‌

ఒకే సారి జయలలిత పై మూడు బయోపిక్స్‌

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఏకకాలంలో 3 బయోపిక్‌లు రాబోతున్నాయి. విబ్రి మీడియా ఆధ్వర్యంలో నిర్మాత విష్ణువర్ధన్ జయలలిత మీద బయోపిక్‌కు ప్లాన్ చేశారు. వచ్చే ఫిబ్రవరి 24న జయలలిత జయంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాడానికి సన్నహాలు చేస్తున్నారు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు అప్పుడే ప్రారంభమవడం విశేషం.

13 9

ఇక శక్తి సినిమా పనుల్లో బిజీగా ఉన్న డైరెక్టర్ ప్రియదర్శిని.. జయ మీద మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. గత మే నెలలోనే ప్రాజెక్టు పనులు ప్రారంభమైనట్లు సమాచారం. ఈ సినిమా వచ్చే ఫిబ్రవరి 24న జయలలిత జయంతి సందర్భంగా షూటింగ్ ప్రారంభమవుతుందని చెబుతున్నారు.

ప్రముఖ నిర్మాత భారతీరాజా ఆధ్వర్యంలో మరో సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి టైటిల్ “అమ్మ: పురచ్చితలైవి” గా ఖరారు చేశారు. ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్, అనుష్కాశెట్టి లాంటి టాప్ హీరోయిన్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. భారతీరాజా వెర్షన్ కి డిసెంబర్లోనే షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. తమిళ్, తెలుగు, హిందీ వెర్షన్లలో ఈ మూడు బయోపిక్ లకు ప్లానింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu