HomeTelugu Trending'నా సామిరంగ' షూటింగ్‌ పూర్తి

‘నా సామిరంగ’ షూటింగ్‌ పూర్తి

Naa Saami Ranga movie shoo

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘నా సామిరంగ’. విజయ్‌ బన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్‌ యంగ్‌ హీరోలు అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌లు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి విడుదలై అప్డేట్స్‌ సినిమాపై మంచి హైప్‌ని క్రియేట్‌ చేశాయి.

ఈ సినిమా సంక్రాంతి జనవరి 14l ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ చేసుకోకుండానే విడుద‌ల తేదీ ప్ర‌క‌టించారు అంటూ సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ మొద‌ల‌య్యాయి. ఈక్రమంలో వాటికి ఫుల్‌స్టాఫ్‌ పెడుతూ.. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్బంగా మూవీ టీమ్ అంతా క‌లిసి ఉన్న చివ‌రి వీడియోను మూవీ యూనిట్‌ షేర్‌ చేసింది. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu